ఏక్ మార్.. దో మార్.. తీన్మార్
అమ్మ బైలెల్లినాదో నాయన తల్లి బైలెల్లినాదో..
మాయాదారి మైసమ్మో మైసమ్మా..
అంటూ పల్లె పట్నాలు ఆట పాటలతో కదం తొక్కేందుకు సిద్దమవుతున్నాయి. ప్రతీ సంవ్సరం లాగానే ఈ యేడు కూడా బోనాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ ఇలా ఏ పేరుతో పిలిచినా అమ్మలగన్న అమ్మ ముగ్గురటమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి పలుకుతుంది..
ఆషాడం వచ్చిందంటే ఊరు వాడ బోనాల శోభ సంతరించుకుంటుంది.. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు ఒకే ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ బోనాల పండుగ పర్వ దినాలలో అమ్మవార్ల పాటలతో యువత చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఉత్సాహం నింపే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ బోనాల వేడుకలను జరుపుకోవడం ఇక్కడ మనం చూస్తాం.
నెట్లో అందుబాటులో ఉన్న బోనాల పాటలు.. మనలోకం పాఠకుల కోసం..