వైరల్ వీడియో; విషపూరితమైన పాముని మింగేసిన కప్ప…!

ఆస్ట్రేలియాలో ఒక కప్ప అత్యంత విషపూరితమైన పాముని మింగేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మంగళవారం క్వీన్స్ ల్యాండ్ లో ఈ ఘటన జరిగింది. జామీ ఛాపెల్ అనే వ్యక్తి ఇంటికి వెళ్తుండగా పేస్ట్ కంట్రోల్ యజమాని అయిన ఒక మహిళ తన పెరట్లో అత్యంత విషపూరితమైన తీర ప్రాంత తైపాన్ పాముని గుర్తించింది. అంతే ఆమె గుండెలు జారిపోయాయి దాన్ని చూసి.

ఎందుకంటే అది ప్రపంచంలోనే మూడో అత్యంత విషపూరితమైన పాము. అది కరిస్తే మనిషి మాంసంలోకి లోతుగా విషాన్ని పంపిస్తుంది. ఆ పాము విషం నాడీ వ్యవస్థను మరియు రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది తలనొప్పి, వికారం, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం మరియు మూత్రపిండాల దెబ్బతినడానికి దారితీస్తుందట. దీనిపై ఛాపెల్ స్పందిస్తూ తాను ఇంటికి వెళ్తున్న సమయంలో సదరు మహిళ తనను పిలిచి౦దన్నారు.

“నేను అక్కడకు వచ్చే సమయానికి కప్పను పాము చాలా సార్లు కరిచింది, కాని దాన్ని పూర్తిగా కప్పు మింగేసింది” అని అతను వివరించాడు. రెండు రోజుల క్రితం ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ కప్పు మాత్రం అత్యంత విషపూరితమైన పాములను తింటుంది అని అక్కడి అధికారులు చెప్తున్నారు.

అయితే మిస్టర్ చాపెల్ పామును కాపాడాలని అనుకున్నా గాని, కాని అతను ఇంటికి వచ్చే సమయానికి చాలా ఆలస్యం అయిందట. “కప్ప అప్పటికే దాన్ని సగం తినేసింది అని అది విడిచిపెట్టలేదట. అయితే ఆ కప్పు బ్రతికింది లేదు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే కామెంట్లలో మాత్రం ఆ కప్పకు ఆ పాములను తినడం అలవాటే అని అది బ్రతికింది అంటున్నారు.