వైరల్ వీడియో; కాఫీతో పిల్లి పిల్లలను కాపాడాడు…!

సోషల్ మీడియా పుణ్యమా అని మనుషుల్లో ఏదో ఒక మూల అక్కడక్కడా బ్రతికి ఉన్న మానవత్వం బయటకు వస్తుంది. జంతువులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మరో ఇబ్బంది పడుతున్నా మనుషులు సాయం చేస్తూ వాటి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి డైలీ మెయిల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కెనడాలోని అల్బెర్టోలో ఒక వ్యక్తి తన కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో మూడు పిల్లి పిల్లలు మంచులో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఆ మూడు మంచులో కూరుకుపోయాయి. దీనిని గమనించిన ఆ వ్యక్తి తన కారుని ఆపాడు. ఆ పిల్లి పిల్లల వద్దకు వెళ్లి వాటి పరిస్థితి చూసాడు.

తీసుకువెళ్ళేందుకు ప్రయత్నం చేసాడు. అయితే అనూహ్యంగా వాటి తోక మంచులో కూరుకుపోయింది. దీనితో తన వద్ద ఉన్న వేడి వేడి కాఫీని ఆ మంచు మీద పోసాడు. మంచు కరగడంతో వాటిని తీసుకుని వెళ్లి తన కారులో పెట్టుకుని తీసుకువెళ్ళాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిల్లి పిల్లలను కాపాడిన వ్యక్తిని పలువురు అభినందిస్తున్నారు.