ఎయిర్ పోర్టులో లగేజీ చార్జీ తప్పించుకోవడానికి ఈయన ఏం చేశాడో చూడండి..!

-

ఎయిర్ పోర్టులో మనోడు చేస్తున్న ఈ వింత పనిని చూసిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మనోడి బాగోతం బయటపడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా బస్సులో, ట్రెయిన్లలో ఎంత లగేజ్ అయినా తీసుకెళ్లొచ్చు. కానీ.. విమానంలో మాత్రం పరిమిత లగేజ్ కు మాత్రమే అనుమతిస్తారు. పరిమితం దాటితే కొంత చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఓ ప్రయాణికుడు ఎక్కువ లగేజీతో ఎయిర్ పోర్టుకు వచ్చాడు.

ఎక్కువ లగేజీ ఉండటంతో లగేజీ చార్జీని తప్పించుకోవాలని ఏం చేశాడో తెలుసా? తన బ్యాగ్ ఓపెన్ చేసి.. అందులో ఉన్న షర్టులన్నింటినీ ఒంటి మీద ధరించాడు. అలా దాదాపు 15 షర్టులు ధరించాడు. అయితే.. ఎయిర్ పోర్టులో మనోడు చేస్తున్న ఈ వింత పనిని చూసిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మనోడి బాగోతం బయటపడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రయాణికుడు తన ఫ్యామిలీతో కలిసి గ్లాస్గో నుంచి ఎడిన్ బర్గ్ వెళ్తుండగా ఈ ఫన్నీ ఘటన చోటు చేసుకున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version