త్రిపుల్ తలాక్ చెప్పాడని భర్త చెంపలు వాయించింది..!

-

Wife thrashes husband over triple talaq

భర్త.. తనకు త్రిపుల్ తలాక్ చెప్పాడని అతడి చెంపలను వాయించింది ఓ మహిళ. అది కూడా పంచాయతీ పెద్దల ముందే. ఈ వింత ఘటన బీహార్ లోని ముజఫర్ పూర్ లో చోటు చేసుకున్నది.

మహ్మద్ డులారే, సోనీ లకు 2014 లో పెళ్లి జరిగింది. వాళ్లది ప్రేమ వివాహం. పెళ్లయిన కొన్నేళ్ల వరకు వాళ్ల కాపురం సజావుగానే సాగింది. కానీ.. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో సోనీ.. పంచాయతీ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిచి మాట్లాడుతున్నారు. పంచాయతీ జరుగుతోంది. ఇంతలోనే డులారేకు కోపం వచ్చి లేచి నిలబడి.. తన భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో కోపోద్రికురాలైన సోనీ.. పంచాయతీ పెద్దల ముందే తన భర్త చెంపలను వాయించింది. డులారే కూడా కోపంతో తనపై దాడి చేయబోయాడు. ఇంతలో పెద్దలు జోక్యం చేసుకొని వాళ్లను విడదీసి వాళ్లకు సర్దిచెప్పి ఇంటికి పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version