96 రీమేక్.. గోపిచంద్ ఫిక్స్..!

-

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సినిమా 96. ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యింది. దిల్ రాజు ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్, నాని ఇద్దరిలో ఒకరు ఈ సినిమా చేస్తాడని అనుకోగా వాళ్లిద్దరు ఈ రీమేక్ పై ఇంట్రెస్ట్ చూపించలేదట.

ఆ రీమేక్ హీరో వేటలో ఉన్న దిల్ రాజు యాక్షన్ హీరో గోపిచంద్ తో ఈ సినిమా చేయాలని చూస్తున్నాడట. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని గోపిచంద్ ఈ రీమేక్ తో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. తమిళంలో చేసిన త్రిషనే రీమేక్ లో కూడా నటింపచేయాలని చూస్తున్నాడు దిల్ రాజు.

మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్ ఉన్న గోపిచంద్ కు 96 లాంటి ఎమోషనల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. యువ హీరోలు కొత్త ప్రయోగాలు చేస్తూ సక్సెస్ లు కొడుతుండగా వారి దారిలోనే గోపిచంద్ ఈ రీమేక్ మూవీ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version