ప్రియుడి కోసం సొంత ఇంట్లోనే కోటి రూపాయలు దొంగలించిన యువతి..

-

Woman commits robbery at own home to meet lover's needs

ప్రేమ మరీ ఇంత గుడ్డిదా. ప్రేమ కోసం ఏదైనా చేస్తారా అనిపిస్తుంది కదా టైటిల్చదివాక. అవును.. ఆ యువతి.. తన ప్రియుడి కోరిక తీర్చడం కోసం ఏకంగా తన ఇంటికేకన్నమేసింది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లో చోటు చేసుకున్నది. 20 ఏళ్లప్రియాంక, హెట్ షా(20) ఇద్దరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. హెట్ కు  పైలట్ అవాలనేది ఆశ. తను పైలట్ అవ్వాలనుకున్న విషయాన్ని తన ప్రేయసి ప్రియాంకకుచెప్పాడు. ప్రియాంక కాస్త రిచ్ గర్ల్. హెట్ మధ్య తరగతి వ్యక్తి. దానికి సంబంధించిట్రెయినింగ్ చేయడానికి బెంగళూరు వెళ్లాలి. అంత డబ్బు హెట్ దగ్గర లేకపోవడంతో..ఎలాగైనా తన ప్రియుడి కోరికను తీర్చాలనుకున్న ఆ యువతి.. ఏకంగా తన ఇంటికే కన్నంవేసింది.

తన ఇంట్లో 3 కిలోల బంగారు నగలు, 2 కిలోల వెండి, కొంత నగదును దొంగలించింది.అంతా ఓ కోటిపైనే ఉంటుంది. అంతే కాదు.. ఇంట్లో దొంగతనం జరిగిందన్నట్టుగానిరూపించడానికి ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసింది. తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఈ దొంగతనానికి పాల్పడింది ప్రియాంక. ఈ ఘటన జరిగింది నవంబర్ 29న. తర్వాత ఆ నగలు, డబ్బు తీసుకెళ్లి తన ప్రియుడికి ఇవ్వడంతో.. అతడు పైలట్ ట్రెయినింగ్కోసం బెంగళూరు వెళ్లిపోయాడు. ఇక.. ప్రియాంక తల్లిదండ్రులు డిసెంబర్ 1 న ఇంటికితిరిగి వచ్చి ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారంఅందించారు.

దొంగతనం గురించి అడిగితే.. ప్రియాంక సంబంధం లేని సమాధానాలు చెప్పడంతోపోలీసులకు ప్రియాంకపై అనుమానం వచ్చింది. దీంతో తన గురించి ఆరా తీయగా.. తను హెట్అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది. అతడి గురించి ఆరా తీయగా.. అతడుబెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. బెంగళూరు వెళ్లిన పోలీసులు హెట్ ను అదుపులోకితీసుకొని విచారించగా… అసలు విషయం బయటికి వచ్చింది. తమ సొంత కూతురురే ఇంట్లోదొంగతనానికి పాల్పడిందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక.. తమపరువే పోతుందని ఆ కేసును కూడా వాపసు తీసేసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version