వారి దేవుడోయ్.. అమ్మాయిలను మింగేసిన సింక్‌హోల్

-

ఈ వీడియో చూశాక మాత్రం మీరు నోరెళ్లబెడతారు. ఎందుకంటే.. ఎవ్వరూ ఊహించని ఘటన ఇది. ఇద్దరు అమ్మాయిలు సరదాగా మాట్లాడుకుంటూ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతే ఒక్కసారిగా ఫుట్‌పాత్ మీద సింక్‌హోల్ ఏర్పడింది. దీంతో వాళ్లు అందులో పడిపోయారు. ఈ ఘటన టర్కీలోని దియార్‌బాకిర్‌లో చోటు చేసుకున్నది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు సింక్‌హోల్‌లో దూకి.. ఆ ఇద్దరు అమ్మాయిలను కాపాడారు. చిన్నగాయాలతో బయటపడిన ఆ అమ్మాయిలు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version