వింత: స్నానం చేసి 65 ఏళ్లకు పైనే అయ్యింది.. ఎవరంటే..?

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా ఓ రోజు స్నానం చెయ్యక పోతేనే బ్యాడ్‌ స్మెల్‌ రావడం లేదా చికాకుగా ఉండడం, దురదలు రావడం ఎదో ఒకటి ఉంటుంది. వేసవి కాలం లో అయితే రోజుకి రెండు సార్లు స్నానం చేస్తే కానీ చాలదు.  అలాంటిది ఓ వ్యక్తి స్నానం చేయక దాదాపు 65 ఏళ్లకు పైనే అయ్యిందట. మరో విషయం ఏమిటంటే..? ఎక్కువగా నాన్‌వెజ్‌ వంటకాలను ఇష్టపడే హాజీ కుళ్లిపోయిన మాంసాన్ని కూడా తినేస్తాడట.

world dirtiest

మరి పూర్తి వివరాల లోకి వెళితే… ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి స్నానం చేయక దాదాపు 65 ఏళ్లకు పైనే అయ్యిందట. చూసిన ప్రతీ ఒక్కరు దేవుడా అంటున్నారు. స్నానం చేయకుండా 65 ఏళ్లకు పైన అవ్వడం తో అతడు ప్రపంచం లోనే అత్యంత మురికి మనిషిగా పేరు గాంచాడు. ఈ వ్యక్తి కి 83 ఏళ్ళు. ఇంత వయసులోనూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు.

ఎందుకు స్నానం చెయ్యడం మానేసాడు అనే విషయానికి వస్తే… ఇరాన్‌ లోని దెజ్‌ అనే ప్రాంతం లో నివసిస్తున్న హాజీ కి ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్యం బాలేదు. దీనికి కారణం స్నానం చేయడం అని అనుకున్నాడు. ఇలా తాను స్నానం చేయడం వల్లే ఆరోగ్యం దెబ్బతిందని భావించి..అప్పటి నుంచి స్నానం చేయడం మానేశాడట. దీనితో అతను ప్రపంచం లోనే అత్యంత మురికి మనిషిగా పేరు గాంచాడు.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...