క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

-

క్రిస్టియన్లు ప్రతి ఏటా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు మిన్నంటుతాయి. అన్ని చర్చిల్లోనూ క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అయితే డిసెంబర్ 25వ తేదీకి, క్రిస్మస్ పండుగకు సంబంధం ఏమిటి ? క్రైస్తవులు ఆ పండుగను ప్రతి ఏటా అదే రోజున ఎందుకు జరుపుకుంటారు ? దాని వెనుక ఉన్న కథేమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్టియన్లకు ఆరాధ్య దైవమైన ఏసు క్రీస్తు జన్మించింది.. డిసెంబర్ 25వ తేదీనే.. అందుకనే ఆయన జన్మదినాన్ని క్రిస్మస్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఆయన జననానికి సంబంధించిన కథ ఇలా ఉంది..

why christians celebrate christmas festival

యూరప్‌లోని రోమన్ సామ్రాజ్యంలో నజరేతు అనే పట్టణంలో ఉండే మేరీకి, జోసెఫ్‌కు వివాహం నిశ్చయమవుతుంది. ఆ తరువాత ఒక రోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవ దూత కలలో కనబడి.. నువ్వు కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావని.. చెబుతాడు. అలాగే పుట్టే బిడ్డకు ఏసు అనే పేరు పెట్టాలని, అతను దేవుడి కుమారుడని.. గాబ్రియెల్ చెబుతాడు. కాగా ఏసు అంటే.. రక్షకుడు అని అర్థం వస్తుంది. అయితే దేవదూత చెప్పినట్లుగానే మేరీ గర్భం దాలుస్తుంది. దీంతో జోసెఫ్ మేరీని వివాహం చేసుకునేందుకు అంగీకరించడు.

అయితే జోసెఫ్‌కు దేవదూత కలలో కనిపించి.. నువ్వు మేరీని విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుడి వల్ల గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరినీ వారి పాపాల నుంచి రక్షిస్తాడు.. అని చెబుతాడు. దీంతో జోసెఫ్ మేరీని వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత వారు బెత్లెహామ్‌కు చేరుకుంటారు. అయితే అక్కడ వారికి ఉండేందుకు నివాసం దొరకకపోతే వారు ఒక సత్రం యజమానికి చెందిన పశువుల పాకలో ఆశ్రయం పొందుతారు. ఈ క్రమంలో అదే పాకలో మేరీ ఏసుక్రీస్తుకు జన్మనిస్తుంది. దీంతో ఏసు క్రీస్తు పుట్టిన రోజైన డిసెంబర్ 25వ తేదీని క్రిస్టియన్లు క్రిస్మస్‌గా జరుపుకుంటూ వస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news