దీపావళికి ఇంటిని క్లీన్ చేస్తున్నారా..? అయితే వీటిని మాత్రం మరచిపోకుండా తీసేయండి..!

-

దసరా పండుగ అయిపోయింది. ఇక దీపావళి సందడి మొదలైపోయింది. హిందూమతంలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీదేవిని పూజించడం వలన ప్రయోజనం ఉంటుంది. ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. శ్రేయస్సు లభిస్తుంది. దీపావళి నాడు శుభ్రతకి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇంట్లో పరిశుభ్రతని ఎలా లక్ష్మీదేవి ఇష్టపడుతుందో ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచితే ఆగ్రహిస్తుంది. మరి దీపావళికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈ వస్తువులను కచ్చితంగా తొలగించడం మర్చిపోకండి.

పాత చెప్పులు వంటివి ఇంట్లో లేకుండా తొలగించాలి. ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇలాంటివి ఉండడం వలన దరిద్రం కలుగుతుంది. సిరిసంపదలు తొలగిపోతాయి. అలాగే పగిలిన గాజు వస్తువుల్ని కూడా ఇంట్లో ఉంచకూడదు పగిలిపోయిన గాజు వస్తువులు ఇంట్లో ఉండడం వలన నెగిటివ్ ఎనెర్జీని కలుగుతుంది.

పాతవి లేదా విరిగిపోయిన విగ్రహాలని నిమజ్జనం చేయకుండా ఇళ్లల్లో ఉంచేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటివి ఇంట్లో లేకుండా చూసుకోవాలి. లేదంటే అనవసరంగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో కొంతమంది ఏళ్ల తరబడి కొన్ని వస్తువుల్ని ఉంచుతారు. చెత్త ఉండే ప్రదేశంలో చిరిగిన బట్టలు పాత పత్రికలు కార్డుబోర్డు ఇతర వ్యర్థ పదార్థాలు వంటి వాటిని తొలగించాలి చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి ఇంట్లో ఎక్కువగా ఉన్నట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news