నవరాత్రి పండుగనే హిందువులు పవిత్రమైన పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంటిని ఎంతో అందంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతికూల శక్తిని తొలగించడం చాలా అవసరం. అందుకే నవరాత్రులు మొదలు కావడానికి ముందు ఇంటిని శుభ్రం చేయాలి. ఇంట్లోని కొన్ని వస్తువులని ఇంటి నుంచి బయటికి విసిరేయడం చాలా మంచిది. అలా చేయడం వలన దుర్గామాత అనుగ్రహం కూడా కలుగుతుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష ప్రతిపద తిధి అక్టోబర్ మూడవ తేదీ ఉదయం 12:18 గంటలకు మొదలవుతుంది. అదే సమయంలో అక్టోబర్ 4 తెల్లవారుజామున రెండు 5:08 గంటలకు ముగుస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో నవరాత్రులు అక్టోబర్ మూడు నుంచి మొదలవుతాయి. ఈ సమయంలో ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని తీసేయాలి. ఎలాంటి వస్తువులు తీసేయాలి అనే విషయానికి వస్తే… ఇంట్లో విరిగిపోయిన విగ్రహాలు, చిరిగిన బట్టలు, విరిగిన గడియారాలు, విరిగిపోయిన పాత్రలు వంటివి ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. మంచి ఎనెర్జీని తొలగిస్తాయి.
అలాగే ఎండిపోయిన పువ్వులు, వ్యర్థ పదార్థాలు కూడా బయటకి పాడేయాలి. పాత బూట్లు చెప్పుల్ని కూడా విసిరేయాలి. పనికిరాని చీపుర్లు వంటివి కూడా ఇంట్లో నుంచి తొలగించాలి అలాగే అనవసరమైన వస్తువుల్ని కూడా బయటకి పారేయాలి. ఎండిపోయిన తులసి మొక్కని ఇంట్లో ఉంచుకోవడం వలన అశుభం కలుగుతుంది. ఇలా వీటిని ఆచరించినట్లయితే దుర్గాదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.