పాఠాలు చెప్పే టీచర్ కావాలి..బూతులు మాట్లాడే వారొద్దు : విద్యార్థినుల ఆందోళన

-

మాకు పాఠాలు చెప్పే వారు కావాలి కానీ, బూతులు మాట్లాడే టీచర్, ఫోన్ చూసే వారు వద్దని స్కూల్ విద్యార్థినీలు ఆందోళనకు దిగారు. ఈ ఆసక్తి కరమైన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వెలుగుచూసింది. అయితే, తమ పాఠశాలలో చదువులు చెప్పే టీచర్ కావాలని విద్యార్థులు నిరసనకు దిగారు. గతంలో 200 మంది విద్యార్థులకు నలుగురు టీచర్లు ఉండేవారని, ఈ ఏడాది ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీ కావడంతో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నాడని స్టూడెంట్స్ చెబుతున్నారు.

బదిలీపై వెళ్లిన టీచర్ల స్థానంలో కొత్తవారు రాలేదు. దీంతో ఉన్న ఒక టీచర్ 30 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి వస్తుంది. అయితే, ఆయన కూడా సమయానికి రాకపోవడంతో పిల్లలు కూడా తమకు తామే చదువుకుంటునట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలాఉండగా, ఉన్న ఒక్క టీచర్ తమకు చదువు చెప్పడం లేదని, బూతులు తిడుతున్నారని, కొడుతున్నారని, బడికి సమయానికి రారని, వచ్చినా ఫోన్ చూస్తూ ఉంటాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు వెంటనే ఆ టీచర్‌పై తగిన చర్యలు తీసుకుని, కొత్త టీచర్ల నియామకం చేపట్టాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version