సంక్రాతి నాడు ఈ పనులు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది..!

-

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. ఇది నిజంగా చాలా ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఈ పండుగను మొత్తం నాలుగు రోజుల పాటు జరుపుతారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జనవరి 15న వచ్చింది. అయితే సంక్రాంతి పండుగ రోజు వీటిని అనుసరిస్తే తప్పక మంచి కలుగుతుంది. అదే విధంగా మీరు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఒకవేళ కనుక ఏ మాత్రం అయినా ఈ తప్పులు చేశారంటే ఇబ్బందులు తప్పవని గుర్తుపెట్టుకోండి.

చాలా మంది సంక్రాంతి రోజు ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం చేసిన తర్వాత కిచిడీ తింటే మంచిది. అలానే నువ్వులు కలిపిన లడ్డు ని కూడా తీసుకోవడం మంచిది. ఇక ఇది ఇలా ఉంటే సంక్రాంతి రోజు దానధర్మాలు చేస్తే చాలా మంచి కలుగుతుంది. మకర సంక్రాంతి రోజు నదీ స్నానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం సంపాదించుకోవచ్చు. ఒకవేళ నదీస్నానం కుదరకపోతే నీటిలో నువ్వుల్ని వేసి స్నానం చేయవచ్చు.

అలాగే సంక్రాంతి రోజు పూజ చేయండి. నిత్యపూజలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే పురాణాల ప్రకారం నువ్వులని సంక్రాంతి రోజు దానం చేస్తే చాలా మంచిది. నువ్వులు దానం చేయడం వల్ల శని దేవుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు అంటున్నాయి.

కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అలానే ఆ రోజు పితృ తర్పణం చేస్తే మంచిది. కాబట్టి సంక్రాంతి రోజు స్నానం, దానం, పితృతర్పణము, దేవతార్చన తప్పక చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు అంటున్నాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుష్యులు, ప్రకృతి పట్ల కృతజ్ఞతా ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది.

Read more RELATED
Recommended to you

Latest news