కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు? ఈ పండుగ విశిష్టత తెలుసా?

-

కనుమ పండుగ రోజు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ నాడు పశువులను అందంగా అలంకరించి పూజలు కూడా చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతిని పెద్ద పండుగ కూడా అని అంటారు. ఎడ్ల పందాలు, కోడిపందాలు, మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. పల్లెటూర్లో ఈ పండుగని ఎంతో అద్భుతంగా జరుపుతారు. భోగి, సంక్రాంతి తర్వాత మూడవ రోజున కనుమ పండగను జరుపుకుంటారు.

 

కనుమ పండుగనాడు అందరూ కలిసి పశువులని అలంకరించి పూజలు చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట ఊరేగింపులు కూడా చేస్తారు. కనుమ పండుగ రోజు పశువులని ఊరేగించడం మాత్రమే కాకుండా వాటిని అలంకరించడం కూడా జరుగుతుంది. ఈ రోజున పశువులకు ఇష్టమైన ఆహారాన్ని కూడా పెడతారు.
కనుమ పండుగ రోజు మినుమును తప్పకుండా తినాలని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా ఈ రోజున ఎవరు ప్రయాణాలు చేయకూడదని నమ్ముతారు. కనుమ నాడు పూర్వీకులను తలుచుకుని మాంసాహారాన్ని తింటారు.

పసుపుల ను పూజించడంతో పాటుగా మధ్యాహ్నం పూర్వీకులకు తర్పణాలను కూడా ఇస్తారు. కొన్ని ప్రాంతాలలో మేక, కోడి, గొర్రె వంటి వాటిని బలివ్వడం కూడా జరుగుతుంది. భోగి, సంక్రాంతి పండుగలు లో పిండి వంటలు చేస్తారు. కనుమ రోజు పోషక విలువలు ఉండేటువంటి మినుములు తినాలని అందరూ అంటారు. వీటిని తినడం వలన శరీరానికి చలిని తట్టుకునే శక్తి వస్తుంది. అందుకే కనుమ రోజు వీటిని తినాలి అంటారు. అయితే కనుమనాడు ప్రయాణం చేస్తే ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంది అని, అందుకే మూడు రోజులు పాటు పండుగను జరుపుకొని తర్వాత మాత్రమే ప్రయాణం చేయాలి అని అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news