లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో హాలీవుడ్ నటి సజీవదహనం..!

-

అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో గత కొద్ది రోజులుగా కార్చిచ్చు చెలరేగుతోంది. ఇప్పటికే భవంతులు, వేలాది ఎకరాలు కాలి బూడిదయ్యాయి. కోట్లాది రూపాయలు ఆస్తి మంటల్లో కాలిపోయింది. తాజాగా ఈ మంటల్లో హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ(95) సజీవ దహనం అయినట్టు బంధువులు సోషల్  మీడియాక వేదికగా తెలిపారు. ఇంట్లో కాలిపోయిన అవశేషాలను అధికారులు గుర్తించారు. ద్రిబ్లూస్ బ్రదర్స్, దిటెన్ కమాండ్ మెంట్స్, లేడీ సింగ్స్ దిబ్లూస్ పాత్రలకు రిటైర్డ్ హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ పేరు ప్రఖ్యాతలు గడించారు.

కార్చిచ్చు చెలరేగడంతో ఆమె తప్పించుకోలేకపోయారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కాలిఫోర్నియాలోని అల్టాడెనాలోని ఆమె ఇంట్లో అవశేషాలు గుర్తించారు. డాలీస్ కర్రీ చివరిసారిగా జనవరి 07న సాయంత్రం కనిపించింది. ఆమె మనవరాలు డాలీస్ కెల్లీ.. ఆమెను ఇంటి దగ్గర దింపి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం కెల్లీ.. డాలీస్ కర్రీని గుర్తించే ప్రయత్నం చేసింది. కానీ ఆచూకి లభించలేదు. చివరికీ తన అమ్మమ్మ చనిపోయిందని తాజాగా సోషల్ మీడియా వేదికగా కెల్లీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news