త్వరలో రంజాన్ పండుగ వస్తోంది. రంజాన్ అంటే ముస్లింల ముఖ్యమైన పండగ. ముస్లింలు రంజాన్ మాసం అంతా కూడా ఉపవాసం చేస్తారు. ఇంచుమించు అందరూ కూడా ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు నిజానికి ఉపవాసం సమయంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ హృదయ సంబంధిత సమస్యలు, హై బిపి లేదా డయాబెటిస్ ఉండి ఉపవాసం చేస్తున్నట్లయితే ఎలక్ట్రోలైట్ ఇన్ బ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఏది ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ప్రమాదం ఏమీ రాకుండా ఉండాలంటే రంజాన్ లో ఉపవాసం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది చేసే కొన్ని రకాల తప్పులు వలన హృదయ సంబంధిత సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని కచ్చితంగా అనుసరించాలి.
అధిక ఆహారాన్ని తీసుకోవద్దు:
ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే హార్మోలలో సమస్య కలిగే అవకాశం ఉంది. ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు గెరిలన్ లెవెల్స్ పెరుగుతాయి, తినిన తర్వాత లెప్టిన్ లెవెల్స్ పెరుగుతాయి అయితే బాగా అతిగా తీసుకోవడం వలన ఈ రెండిటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఫ్లూయిడ్స్ ని తీసుకోండి:
ఎక్కువ నీళ్లు తీసుకోవడం ఫ్లూయిడ్స్ ని తీసుకోవడం చాలా ముఖ్యం కనీసం రోజుల్లో 8 గ్లాసుల నీళ్లు తీసుకోవడం మంచిది. లేకపోతే డిహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది. వాటర్ పిల్స్ ని సాయంత్రం పూట తీసుకోవడం మంచిది ఇలా చేయడం వలన హైడ్రేషన్ ఉంటుంది.
కెఫీన్ తీసుకోవద్దు:
కాఫీ టీ సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవద్దు. ఐరన్ ఒంట్లో లేకుండా ఇది చేస్తుంది అలానే తరచూ యూరిన్ వస్తూ ఉంటుంది. దీంతో డిహైడ్రేషన్ సమస్య కలగొచ్చు.
మెటబాలిక్ సిండ్రోమ్:
మీరు తీసుకునే డైట్ లో పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా అందేటట్టు చూసుకోవాలి లేదంటే కొన్ని కండిషన్స్ వలన హార్ట్ ఎటాక్ స్ట్రోక్ డయాబెటిస్ వంటి ఇబ్బందులకి
గురవ్వాల్సి ఉంటుంది.
తిన్న తర్వాత నీళ్లు తాగండి:
చాలామంది ఆహారంతో పాటుగా అనేక రకాల లిక్విడ్స్ ని తీసుకుంటూ ఉంటారు ఇది కూడా సమస్యను కలిగిస్తుంది కాబట్టి తిని కాసేపు ఆగి ఆ తర్వాత ఫ్లూయిడ్స్ ని తీసుకోండి.
ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండండి:
ఫిజికల్ ఆక్టివిటీ చాలా ముఖ్యం అలానే మంచి నిద్ర కూడా అవసరం ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తే సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు.