ఫ్యాక్ట్ చెక్: ఉద్యోగాలు ఇస్తున్న ఈ ట్విట్టర్ అకౌంట్ ఫేక్ .. జాగ్రత్త సుమా..!!

-

సోషల్ మీడియాలో మనకి తరచూ నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి నకిలీ వార్తలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చాలా మంది వీటి వలన మోసపోతున్నారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్నీ కూడా నిజం కావు అని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని కొన్ని నకిలీ వార్తలు వస్తూ ఉంటాయి. ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

తాజాగా సోషల్ మీడియా లో మరొక వార్త వచ్చింది. మరి అది నిజమా కదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరు తో ట్విట్టర్ లో ఒక నకిలీ ఖాతా ఉంది. ఆ ఖాతా నిజం అనుకుని చాలా మంది మోసపోతున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి ట్విట్టర్ అకౌంట్ లేదు. కానీ SSC అఫీషియల్ అనే ఒక అకౌంటు (@ssc_official__) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక అకౌంటు అని ప్రచారం చేస్తోంది.

ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే అనవసరంగా ఇలాంటి వార్తలు నమ్మి మోసపోకండి. కేంద్ర ప్రభుత్వం స్కీములు మొదలు ఉద్యోగాల వరకు చాలా నకిలీ వార్తలు మనకి తరచు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఎవరికీ షేర్ చేయకండి. అలానే నమ్మి మోసపోకండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7000 కి పైగా ఉద్యోగాలని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version