​శివరాత్రికి నాలుగు యామాల పూజ ఇలా చేయాలి !

-

శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైంది. అన్ని పండుగలు పొద్దున చేసుకుంటే ఈ పండుగను రాత్రి అంతేకాదు అర్ధరాత్రి చేస్తారు. అంతేకాదు నాలుగు జాములు అదేనండి యామలు పూజ చేస్తారు. ఈ విశేషాలు తెలుసుకుందాం…
యామ పూజ, యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోనూ శివునికి అభిషేకం చేయాలి. ప్రథమయామం రెండవ యామంలోను, మూడవ యామంలో మొదటి రెండు యామాలు అంతర్గతాలు.

ఇలాగే నాలుగో యామం చివర తెల్లవారుతుంది. ఈ నాలుగు యామాలు వాస్తవంగా మాండుంక్యంలోని (స్నోయమాత్మా చతుస్పాద్) ఆత్మకి నాలుగు పాదాలు ఉన్నాయి అని తెలియజేస్తుంది. విశ్వపాదం తైజసపాదంలోను.. విశ్వతైజసపాదాలు ప్రాజ్ఞపాదంలోను ఈ మూడు పాదాలు తురీయపాదంలోను అంతర్గతాలు. ‘త్రయాణాం’ విశ్వాదీనాం పూర్వపూర్వ ప్రవిలాపనేన తూరీయస్య ప్రతిపత్తిరితి’అని శ్రీ శంకర భాగవతాదులు మాండూక్య భాష్యంలో చూపారు. ఈ విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయములు అద్వితీయ ఆత్మలో వికల్పాలని గుర్తిస్తే ఆ నాల్గవ యామం చివరిలో తెల్లవారినట్లు అప్పుడు పరమార్థ జ్ఞానోదయం కలుగుతుంది. ఇదే శివ జాగరణ రహస్యం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news