శ్రీరాముడు అపుడు జన్మించాడో మీకు తెలుసా…?

-

చాలా మంది చారిత్రకులు రాముడి గురించి అధ్యయనం చేశారు. శ్రీరామచంద్రుడు చారిత్రక పురుషుడని పాశ్చాత్యులు కూడా నిర్ధారించారు. పురాణాలలోని రాజవంశాలను పరిశీలించి శ్రీరాముడు మహాభారత యుద్ధం నాటికి అతి ప్రాచీనుడని నిర్ధారించారు. శ్రీరాముని వంశస్థుడు శ్రీకృష్ణుని సమకాలీకుడు అయిన బృహద్బలుడు మను వంశమున 94వ వాడని సుప్రసిద్ధ పాశ్చాత్య చారిత్రకుడు పర్గిటేరు నిర్ణయించారు.

 

ఈయన వాదం ప్రకారం మహాభారత యుద్ధం క్రీ.పూ.15వ శతాబ్దాన జరిగింది. పర్గిటేరు పరిశోధన ప్రకారం శ్రీరాముడు క్రీ.పూ.21వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీరాముని జనన సంవత్సరాన్ని బట్టి క్రీ.పూ.2055లో శ్రీరామచంద్రుడు జన్మించాడని ఎల్‌డీ స్వామి కన్ను పిళ్ళే నిర్ణయించారు.దీన్ని ఎంఆర్ సంపత్కుమారన్ ఈ వాదాన్ని నిర్ధారించారు.

మరికొందరు పాశ్చాత్య చారిత్రకారులు రామాయణం క్రీ.పూ. 1000 సంవత్సరాల కిందదని నిర్ణయించారు. శ్రీరాముడు జన్మించక ముందే రామనామం గురించి వేదాల్లో పేర్కొనబడిందని కందాడై వేంకట సుందరాచార్యస్వామి పేర్కొన్నారు. ప్రాచీన రుగ్వేదంలో (93.14)లో శ్రీరామనామాన్ని స్మరించబడింది. తైత్తరీయ ప్రాతిశాఖ్యమున పేర్కొనబడిన పురుషులలో శ్రీవాల్మీకి మహర్షి పేరుఉన్నదని వెబర్ అనే శాస్త్రవేత్త చరిత్రకారుడు పరిశోధించి చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news