ఉగాది పచ్చడి తింటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

-

ఉగాది నాడు కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి చేసుకుని తింటారు ఇందులో షడ్రుచులు ఉంటాయి. అవే తీపి, వగరు, కారం, పులుపు, ఉప్పు, చేదు. అయితే నిజానికి చాలా మంది ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చేస్తూ ఉంటారు కానీ ఉగాది పచ్చడి తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందొచ్చు. మరి ఉగాది పచ్చడిని తింటే ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం.

ఉప్పు:

ఉప్పు భయాన్ని సూచిస్తుంది. ఉప్పు మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా మార్చుతుంది. అలానే ఉప్పు ఆకలి వేసేలా చేస్తుంది. అలానే ఉప్పు వలన నష్టాలు కూడా కలుగుతాయి. కాబట్టి లిమిట్ గా తీసుకోవడమే మంచిది.

తీపి:

తీపి ఆనందాన్ని సూచిస్తుంది మన మనసుని ప్రశాంతంగా మారుస్తుంది ఆకలి కలుగుతుంది ఉగాది పచ్చడిలో మనం బెల్లం వేస్తాము. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పిత్త, వాత సమస్యల్ని దూరం చేస్తుంది. కొత్త కణాలని ఏర్పరచడానికి సహాయం చేస్తుంది.

పులుపు:

పులుపు విసుకుని సూచిస్తుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుతో ఉండాలని అంటుంది. చింతపండుని మనం ఉగాది పచ్చడిలో వేస్తాము. ఇది కఫాన్ని తొలగిస్తుంది జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

కారం:

మనం సహనాన్ని కోల్పోవడానికి కారం సూచిస్తుంది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది జీవక్రియని పెంచుతుంది బరువు తగ్గేందుకు కూడా అవుతుంది. మన శరీరంలో ఉండే క్రిములు ని చంపుతుంది ఇలా కారం వలన కూడా ఎన్నో ప్రయోజనాలనే పొందొచ్చు.

చేదు:

చేదు బాధలకి సంకేతం. వేపపూత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకి పంపించేస్తుంది.

వగరు:

ఉగాది పచ్చడిలో మామిడికాయలని వేస్తాము. మామిడి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి శరీరాన్ని బలంగా ఉంచుతాయి కూడా ఇవి పెంచుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news