ఎప్పటి నుంచి ఉగాది మొదలైంది..? ఈ పండుగ విశిష్టత తెలుసా..?

-

చాలామంది హిందువులు ఉగాది పండుగను తప్పకుండ జరుపుకుంటారు. ముఖ్యంగా ఉగాది పండుగ రోజున ఆలయాలలో పండితులు పంచాంగ శ్రవణాన్ని కూడా నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60 మరియు మొత్తం తెలుగు నెలలు 12 ఉంటాయి. అయితే తెలుగు నెలల్లో మొదటి రోజున ఉగాదిని జరుపుకుంటారు. చైత్రమాసం పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైంది అని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఉగాది పండుగను ఈ రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఉగాది మార్చి 30వ తేదీన రావడం జరిగింది. పంచాంగ శ్రవణంతో పాటుగా ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ తయారు చేసుకుంటారు.

 

ముఖ్యంగా అన్ని పండగలు ఎలా అయితే ప్రకృతితో ముడిపడతాయో ఈ ఉగాది పండుగ కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఉగాది పండుగ రోజున తయారు చేసుకునేటువంటి ఉగాది పచ్చడి వసంత రుతువు వచ్చిందని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా చెట్లు లేత చిగురులతో ఎంతో అందంగా కనబడతాయి. అయితే ఉగాది పండుగను జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని పండితులు చెప్తున్నారు. కొంతమంది ఉగాది అనగా ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షు కు మొదటి రోజు అని భావిస్తారు. దాంతో ఉగాదిగా మారిందని నమ్ముతారు. మరికొందరు అయితే శ్రీరాముడి పట్టాభిషేకం త్రేతాయుగంలో ఉగాది రోజునే జరిగిందని నమ్ముతారు.

పైగా ఉగాది రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం లో సోమకాసురుని చంపి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పండితులు భావిస్తారు. అందువలన బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజు ఉగాదిగా జరుపుకుంటారు. అంతేకాకుండా తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది పండుగ రోజునే సింహాసనాన్ని అధిష్టించాడని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంత శాతం మంది పండితులు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అంటారు. అయితే ఉగాది అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షుకు మొదట రోజుగా ఉండడం వలన ఉగాదిగా మారిందని భావిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news