క్యారెట్ పూరీ తయారీ విధానం

-

రోజుకో క్యారెట్ తినాలని వైద్యులు చబుతారు. దాన్ని సెపరేట్‌గా తినకుండా రోజూ తినే ఆహారంతో తీసుకుంటే సరిపోతుంది. అది ఎలా అంటారా? బ్రేక్‌ఫాస్ట్‌లో.. అంటే .. క్యారెట్ పూరీలు అన్నమాట. క్యారెట్‌తో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. హైబీపీ తగ్గుతుంది. రక్తం ఉత్పత్తి అవుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

కావలసినవి :
గోధుమపిండి : కప్పు
క్యారెట్ రసం : పావుకప్పు
బొంబాయి రవ్వ : రెండు చెంచాలు
నూనె : తగినంత
ఉప్పు : తగినంత.

తయారీ :
ముందుగా వెడల్పాటి బౌల్‌లో గోధుమపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు తీసుకోవాలి. క్యారెట్ రసం, నీళ్లు పోస్తూ చపాతీపిండిలా కలుపాలి. పావుగంట తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పిండిని పూరీల్లా ఒత్తుకొని రెండేసి చొప్పున నూనెలో వేయించుకొని తీసుకోవాలి. అంతే క్యారెట్ పూరీ తయారయినట్లే. ఈ పూరీలను ఆలూకర్రీ గ్రేవీతో తింటే టేస్టీగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news