మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది. కొందరు కాఫీ తాగుతారు. వారి గురించి వదిలేస్తే.. టీ తాగే వారిలో కొంతమంది టీ తాగుతూ మరొక ఆహారాన్ని తింటారు. అంటే రెండింటిని ఏకకాలంలో సేవిస్తారన్నమాట. అయితే ఇలా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఆహారాలను టీతో పాటు అసలు తినకూడదు.
వైట్ బ్రెడ్:
దీనిలో రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్స్ ఉండడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. టీ తాగేటప్పుడు వైట్ బ్రెడ్ తినే అలవాటు మీకుంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఈ అలవాటు వల్ల మీ ఎనర్జీ తగ్గిపోయి బలహీనంగా మారతారు.
అరటిపండు:
ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు అస్సలు తినకూడదు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే టీ తాగేటప్పుడు అరటిపండు తీసుకోకూడదు.
ఫ్రై చేసిన ఆహారాలు:
ఫ్రై చేసిన ఆహారాలు ఏవైనా కూడా టీతోపాటు తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే జీర్ణశక్తి తగ్గడమే కాకుండా కడుపులో అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
ఇడ్లీ:
టీతో పాటు ఇడ్లీ ఎవరైనా తింటారా అని మీకు అనిపించవచ్చు. కానీ టీ లో ఇడ్లీ ని ముంచుకుని తినేవాళ్లు చాలానే ఉంటారు. అలాంటి అలవాటు మీకు ఉంటే వెంటనే మానుకోండి. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.
పఫ్స్:
కర్రీ పఫ్ లాంటి వాటిని టీ తాగేటప్పుడు అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా బ్లాక్ టీ తాగేటప్పుడు వీటికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అలా తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి.