కల్లో గంజో తాగి బ్రతికేస్తే చాలంటారు.. గంజి వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా..?

-

డబ్బు లేక సకల సౌకర్యాలని తాహతు లేక రోజు వారి వచ్చిన డబ్బులతో కాలం వెళ్ళదీస్తుంటే ఈ మాట వినబడుతుంది. కల్లో గంజో తాగి బ్రతికితే చాలు మనకి మేడలు వద్దు, మిద్దెలు వద్దు. కారు బంగ్లాలు అసలే వద్దు అంటారు. గంజి అనేది పేదవారి పానీయం. నిజానికి అది పానీయం కూడా కాదు. బియ్యం ఉడికించగా వచ్చేది. సాధారణంగా చాలా ఇళ్ళలో దీన్ని కింద పడవేస్తారు. అప్పట్లో గంజి నీళ్ళే తాగేవారని చెబుతుండేవారు. ఐతే గంజివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరు దాన్ని వదిలి పెట్టరు.

ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చిన తర్వాత గంజిని అసలు ఎవరూ చూడడం లేదు. బియ్యానికి సరి సమానంగా నీళ్ళు పెట్టి ఉడికించేసి, అన్నాన్ని వండుకుంటున్నారు. కింద చెప్పుకునే లాభాలు తెలిస్తే మీరే రేపటి నుండి అన్నాన్ని గంజి వంపుకునేలా ఉడకబెట్టుకుంటారు.

మలబద్దకం సమస్య ఉన్నవారు గంజిని తాగడం మంచిది. దీనివల్ల జీర్ణ సమస్యలు తొలగిపోయి మలబద్దకం దూరమవుతుంది. రోజూ పొద్దున్న అన్నం వండుకునేటపుడు గంజిని వార్చుకుంటే సరిపోతుంది.

వైరల్ ఫీవర్ మిమ్మల్ని చుట్టుముడితే డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమవుతుంది. దాన్నుండి తట్టుకోవడానికి గంజిని తాగడం బెటర్. శరీరంలో నీటిశాతాన్ని పెంచడానికి బియ్యం ఉడికించిన నీళ్ళు తాగాలి.

ఇంకా చర్మానికి గంజి మేలు అంతా ఇంతా కాదు. మొటిమలు ఇబ్బంది పెడుతుంటే, గంజి రాసుకుంటే ఆ మొటిమలు తగ్గిపోతాయి. ముఖంపై చిన్న చిన్న వాపులు, దురద వంటివి కలిగితే గంజి రాసుకోవడం బెటర్. ముఖం అందంగా మెరవడానికి రాత్రిపూట గంజిని ముఖానికి రాసుకుంటే తెల్లారేసరికి తళతళా మెరిసిపోతుంది.

జుట్టుకి కండిషనర్ గానూ పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version