ఆలు,శనగల మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి అంటే..!

-

మనకు చేసుకోవడం రావాలే గాని ఎన్నో రుచికరమైన వంటలను చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు చేయకుండా కొంచెం కష్టపడితే చాలు ఆలు,శనగల మసాలా కర్రీ చాలా రుచిగా చేసుకోవచ్చు మనం. చపాతి, పూరి వంటి టిఫిన్స్ లోకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అవి టిఫిన్స్ ఏ కదా… ఈ వంటను ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం… మాకు నచ్చింది… మీకు ఎలా ఉంటుందో చుడండి ఒకసారి.

కావలసిన పదార్థాలు : అర కిలో బంగాళదుంపలు, వంద గ్రాముల కాబులీ శనగలు, ఉల్లిపాయ ఒకటి, నాలుగు పచ్చిమిర్చి, రెండు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, కొత్తిమీర, రెండు టమాటాలు, రెండు టేబుల్ స్పూన్ల నూనె . శనగలు తీసుకుని ఒక గంట ముందు నానా పెట్టుకోవాలి. తరువాత బంగాళ దుంపలు చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకోవాలి. కొత్తిమీరను కూడా శుభ్రం చేసి సన్నగా తరగాలి.

తయారి విధానం: ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రషర్ కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. అప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

తరువాత బంగాళా దుంప ముక్కలు, టమాటా ముక్కలు, నానా బెట్టిన శనగలు వేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి పావు లీటర్ నీరు పోసి మూత పెట్టాలి. కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే ఆలు ,శనగల మసాలా కర్రీ రెడీ ..!

Read more RELATED
Recommended to you

Latest news