ఒక్క నెల జీతం కట్ చేస్తే బాధపడే ఉద్యోగులకు అంకితం…!

-

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం ఏంటీ…? ప్రజల గురించి మమ్మల్ని అన్యాయం చేస్తారా…? ప్రజల గురించి మాకు అన్యాయం చెయ్యడం ఎంత వరకు సమంజసం…? సహాయం అడిగితే ఎంతో కొంత విరాళం ఇస్తాం కదా..? మీ అంతట మీరు విరాళం ఏ విధంగా తీసుకుంటారు…? ఇప్పుడు తెలంగాణాలో కొందరు ఉద్యోగులు మాట్లాడే మాటలు ఇవి.

ఈ మాట రాత్రి అనక పగలు అనక కష్టపడే పోలీసులు అన్నా బాగానే ఉంటుంది, ప్రభుత్వ వైద్యులు అన్నా బాగానే ఉంటుంది. కాని సంబంధం లేని వాళ్ళు మాత్రం జీతాల్లో కోత గురించి మాట్లాడటానికి ఎంత మాత్రం అర్హులు కాదని కొందరు అంటున్నారు. పాస్ పుస్తకం ఇవ్వడానికి, చిన్న సర్టిఫికేట్ ఇవ్వడానికి, ఏ అవసరం ఉన్నా సరే వందలు వందలు వసూలు చేసే ఉద్యోగులు ఉన్నారని, వేల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని,

అప్పుడు సామాన్య ప్రజలు కూడా ఇలాగే బాధపడతారని, కాబట్టి ఇప్పుడు నీతులు చెప్పడం ఎంత వరకు సమంజసం కాదని, పాపం పోలీసులు, వైద్యులు, కొన్ని వర్గాల ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారని, కుటుంబాలను వదిలి ముందుకి వస్తున్నారని, కాని ఏ చిన్న సహాయం చేయని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం, వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు తీసుకుని ఒక్క నెల సగం జీతం కట్ చేసి, రైతుల కోసం ఇస్తుంటే ఎందుకు ఇంత కంగారు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news