కేసీఆర్ ని ఫాలో అవుతున్న మహారాష్ట్ర…!

-

రాష్ట్రం కష్టాల్లో ఉన్న సమయంలో అందరూ తలా చేయి వేసుకోవాలని, అందరికి బాధ్యత ఉందని చెప్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కట్ చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చారు. అందరు ఉద్యోగులకు ఇప్పుడు జీతాలు కట్ చేయడానికి గానూ తెలంగాణా ప్రభుత్వం సిద్దమైంది. అందరూ తెలంగాణకు అండగా నిలబడాలని, అందరూ సహాయం చెయ్యాలని స్పష్టం చేసింది.

ఇప్పుడు ఈ నిర్ణయాన్నే మహారాష్ట్ర కూడా అమలు చెయ్యాలని చూస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భారీగా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ముంబై లాంటి నగరం ఉన్నా సరే మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోతుంది. దీనితో ఇప్పుడు అక్కడి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా…? అందరికి సంక్షేమం అందించి ఆర్ధికంగా అండగా నిలవాలా అనే దాని మీద ఇప్పుడు సీరియస్ గా ఉంది.

దీనితో ఉద్యోగులకు ఒక నెల కోత విధిస్తే తప్పు లేదు అని భావించింది. ఇప్పటికే ఆర్ధిక శాఖను ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే ఆదేశించారని, ఉద్యోగులు అందరికి కనీసం 50 శాతం జీతాల్లో కోత విధించాలి అని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఒకటి, రెండో తరగతి ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించబోతున్నట్టు ప్రకటించింది. మూడో తరగతి ఉద్యోగుల జీతాల్లో 25 శాతం కోత విధిస్తున్నట్టు వెల్లడించింది. అయితే జీతాల కోత నుంచి నాలుగో తరగతి ఉద్యోగులను మాత్రం మినహాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news