ఆరోగ్య ప్రయోజనాల “మామిడికాయ పులిహోర”

-

ఉదయాన్నే ఆరోగ్యకరమైన రుచికరమైనదిగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలంటే ప్రతిసారీ అంత సులువైన విషయం కాదు. మామిడికాయ పులిహోర ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శనగపప్పు, మినపప్పు, పల్లీలు తగినంత ప్రోటీన్లను అందిస్తాయి. అందుకే ఇది పర్‌ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీగా ముందుంటుంది. దీంతోపాటు కరివేపాకు న్యూట్రిషన్ లెవల్స్‌ని మరింత పెంపొందిస్తుంది. ఈ నోరూరించే రుచికరమైన డిష్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే రోజంతా ఉత్సాహాన్ని అలాగే క్యారీ చేయగలుగుతారు.

కావాల్సినవి :

బియ్యం : 1 కప్పు
తురిమిన కొబ్బరి : 3/4 కప్పు
నూనె : సరిపడా
కొత్తిమీర : అరకప్పు
పల్లీలు : అరకప్పు
మిరపకాయలు : 10
మామిడికాయ : 1
కరివేపాకు : 2 రెబ్బలు
ఇంగువ : చిటికెడు
ఆవాలు : అర టేబుల్‌స్పూన్
శనగపప్పు : అర టేబుల్‌స్పూన్
మినపప్పు : అర టేబుల్‌స్పూన్
మెంతులు : అర టేబుల్‌స్పూన్
పసుపు : అర టేబుల్‌స్పూన్
ఉప్పు : తగినంత.

తయారీ : బియ్యాన్ని బాగా కడిగి 15 నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత పొడిపొడిగా ఉండేలా అన్నం వండుకోవాలి. తర్వాత మామిడికాయను బాగా తురుముకోవాలి. మెంతులను దోరగా వేయించి పొడి చేయాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి బాగా కలుపాలి. ఇందులోనే పల్లీలు వేసి రంగు మారేవరకు వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, పసుపు, తురిమిన మామిడి వేసి రెండు నిమిషాలపాటు ఉంచాలి. ఇప్పుడు వండిన అన్నాన్ని జోడించి కలుపాలి. అలాగే కొబ్బరి, కొత్తిమీరతో పాటు ఉప్పును కూడా జోడించాలి. చివరగా మెంతిపౌడర్ వేసి కలుపాలి. ఈ డిష్‌ను ఒక బౌల్‌లోకి తీసుకొని చట్నీతో అంతే ఆ టేస్టే వేరులే..

Read more RELATED
Recommended to you

Exit mobile version