2020లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వాట్సాప్

-

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న యాప్ వాట్సాప్‌. 2020లో మరిన్ని టాప్ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ వినియోగదారులకు అందించడంలో వాట్సాప్‌ ముందంజలో ఉంటుంది. ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ దిగ్గజ సంస్థ వాట్సాప్ కొత్త సంవ‌త్స‌రంలో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో రాబోతుంది. ఇదివరకే ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఫేస్‌బుక్ సొంత యాప్.. మ‌రి రాబోయే కొత్త ఏడాది వాట్సాప్ అందించబోయే టాప్ ఫీచర్లు ఏంటో ఓ లుక్కేసేయండి. ఎప్పటినుంచో వాట్సాప్ ఈ డార్క్ మోడ్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది.

ముందుగా iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. బీటా వెర్షన్ రిలీజ్ అయ్యే ఈ ఫీచర్ లో కొన్ని క్రిటికల్ ఎలిమెంట్స్ కనిపించవు. WaBetaInfo ప్రకారం.. డార్క్ మోడ్ ఫీచర్ రెడీగా ఉంది. కానీ, Status Updates cell, Profile వంటి అప్ డేట్స్ వంటి ఎలిమెంట్స్ కనిపించవు. సెట్టింగ్స్ కింద కనిపించే కాంటాక్ట్, స్టోరేజీ లిస్ట్ సెల్స్, Backup సెక్షన్ అప్ డేట్స్ కనిపించవు. ఇక ఫోన్ నెంబర్‌తో పాటు About, Contact Infoలోని సెక్షన్‌లో బిజినెస్ వివరాలు సైతం Inactive మోడ్ లో ఉంటాయి. 2020 నుంచి Stable Version Whatsappలో ఈ Updates అన్ని iOS, Android యూజర్లకు కనిపించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version