శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉన్నాయా..? ఈ ఆహారాలు తీసుకోండి

-

శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గిపోతే అనేక సమస్యలు శరీరాన్ని చుట్టుకుంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపించడం వల్ల రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టదు. అంతేకాదు అమాంతం బరువు పెరగటం, తీవ్రమైన అలసట, ఏ పని చేయబుద్ది కాకపోవడం, బలహీనత కనిపిస్తాయి. కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం, హై బిపి వంటి సమస్యలు మెగ్నీషియం లోపం వల్ల వస్తాయి.

ప్రస్తుతం మెగ్నీషియం అధికంగా గల ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

అవకాడో:

100 గ్రాముల అవకాడో పండులో 29 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం లోపంతో మీరు బాధపడుతున్నట్లయితే ఈ పండును డైట్ లో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

డార్క్ చాక్లెట్:

28 గ్రాముల డార్క్ చాక్లెట్ లో 65 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. అంతేకాదు.. ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి శరీరానికి మేలు చేసే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

బాదం:

100 గ్రాముల బాదం గింజల్లో 268 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. బాదం గింజలను రోజువారి డైట్ లో కచ్చితంగా చేర్చుకోండి. అయితే ఒక రోజులో ఎక్కువ మొత్తంలో బాదం గింజలను తినకూడదు, రెండు లేదా మూడు కంటే ఎక్కువగా తినకపోవడమే మంచిది.

గుమ్మడి గింజలు:

హై బీపీతో బాధపడేవారు గుమ్మడి గింజలను రోజువారి డైట్ లో తినడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 535మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

పాలకూర:

పాలకూర మార్కెట్లో విరివిగా లభిస్తుంది. ఆకుకూరలు శరీరానికి మంచివని అందరికీ తెలుసు. 100 గ్రాముల పాలకూరలో 79 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం లోపం కనిపిస్తే ఈ ఆహారాలను తీసుకోవడం మంచిది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version