కర్ణాటక స్పెషల్ ‘ఎరియప్ప దోశ’ ఎలా చేసుకోవాలి అంటే ..!

-

పాన్ కేక్ లాంటి ఈ వంటకం దక్షిణ భారతంలో ప్రసిద్ధ వంటకం. దీన్ని పిల్లలకు స్నాక్స్ లాగా బాగా ఉపయోగ పడుతుంది. ఇది కర్ణాటక లో బాగా ఫేమస్ దీనిని వెల్లం దోశ అని కుడా అంటారు. ఈ వెల్లం దోశని చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. దీనిని తేనెతో కలిపి తినవచ్చు.

ఎరియప్ప దోశ కు కావలసిన పదార్థాలు: రాత్రంతా నాన పెట్టిన బియ్యం ½ కప్పు, నీరు 1 కప్పు, బెల్లం 1 కప్పు, తురిమిన కొబ్బరి 1 కప్పు, నెయ్యి ½ కప్పు, యాలకుల పొడి ¾ స్పూన్.

తయారి విధానం: మిక్సిజార్ లో నాన పెట్టిన బియ్యం, కొబ్బరి వేసి మెత్తగా మిక్సి పట్టాలి. దీనిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బెల్లం వేసి తగినన్ని నీళ్ళు చేర్చి పాకం పట్టాలి. ఈ బెల్లం పాకాన్ని బియ్యం, కొబ్బరి మిశ్రమంలో కలపాలి. యాలకుల పొడి చేర్చి దోశ పిండిలాగా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే పాన్ పెట్టి నెయ్యి రాసి దోశల్లాగా వేయాలి. ఇది గోధుమ రంగులో వచ్చే వరకు రెండు వైపులా వేయించాలి. వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి గా వడ్డించుకోవాలి. అంతే కర్ణాటక స్పెషల్ ‘ఎరియప్ప దోశ’ రెడీ ..!

పోషక విలువలు: రెండు దోశలకు కేలరీస్ 149g, కొవ్వు 5g, ప్రోటీన్ 3g,కార్బో హైడ్రేట్స్ 22g, చెక్కర 2.8g, పైబర్ 1g.

Read more RELATED
Recommended to you

Exit mobile version