పానీపూరీ.. ఇంట్లోనే తయారు చేసుకోవడానికి రెసిపీ తెలుసుకోండి.

పానీపూరీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో. ఈ కరోనా టైమ్ లో పానీపూరీని మిస్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకుముందు వీధుల్లో పానీ పూరీ బండి ముందు నిలబడి మసాలా నీటిలో ముంచిన పానీపూరీ తింటూ గడిపేవాళ్ళు. కానీ ప్రస్తుతం అదంతా ఒక కలలా మారిపోయింది. వీధిలో బండి ముందు నిలబడి పానీ పూరీ తినే అనుభం ఇప్పట్లో కుదరకపోవచ్చు కానీ, పానీ పూరీ తినే అనుభవం మాత్రం ఇంట్లో ఉండే పొందవచ్చు. అవును, మీ ఇంట్లోనే పానీ పూరీని తయారు చేసుకోవచ్చు.

అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

స్టెప్ 1:

పూరీలు చేయడానికి ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు రవ్వ, ఒక స్పూన్ ఉప్పు తీసుకోండి. ఇప్పుడు వీటి పూర్తి మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి పిండిని బాగా పిసకండి. మెత్తగా అయ్యేవరకు బాగా పిసకాలి.

స్టెప్ 2:

ఇప్పుడు ఆ పిండితో చిన్న చిన్న బంతులు తయారు చేయండి. ఆ బంతులను చదునుగా చేసి వృత్తాకారంలో కత్తిరించండి. ఇప్పుడు పొయ్యి మీద ఉన్న మూకుట్లో వేయాలి. పూరీలు బంగారు రంగు వచ్చేవరకు అలాగే ఉంచాలి.

స్టెప్ 3:

పానీపూరీతో పాటు నంజుకోవడానికి ఉడికించిన బంగాళదుంపలు, కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయలను తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో కలుపుకుని జీలకర్ర, ఛాట్ మసాలా, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు కలుపుకోవాలి.

స్టెప్ 4:

రుచిగల పానీ తయారు చేయడానికి ఒక కప్పు పుదీనా, కప్పు కొత్తిమీర, 2 మిరపకాయలు చింతపండు జోడించాలి. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఒక కప్పు చల్లటి నీరు వేసి బాగా కలపాలి.

అంతే అత్యంత రుచికరమైన పానీ పూరీ తయారీ అయిపోయినట్టే. మీ స్నేహితులతో కలిసి హ్యాపీగా లాగించేయండి మరి.