ఈటెల పేరుతో విడుదలైన లేఖపై హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ లేఖపై తాజాగా బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఈటెల రాజేందర్ రాసిన లెటర్ వాస్తవమని, దీన్ని ఫేక్ లెటర్ గా బీజేపీ చేస్తున్న ప్రచారం కల్పితమని తెలిపారు. ఈటెల రాజేందర్ లెటర్ ఫెక్ అని దమ్ముంటే హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయ ప్రాంగణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్ ప్రమాణం చేయగలరా! అని సవాల్ విసిరారు. ఈటెల రాజేందర్ పేరు ఇకనుండి వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలని పేర్కొన్నారు.
ఈటెల రాజేందర్ ఆత్మభిమానానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు, ఢిల్లీ దగ్గర మొకరిల్లాడని మండిపడ్డారు. ఈటెల రాజేందర్ కాదు ఇక నుండి బీజేపీ రాజేందర్ గానే మిగిలిపోతారని చురకలంటించారు. బీజేపీ వాళ్ళు డబ్బు సంచులతో వస్తారు జాగ్రత్త, గతంలోనే ఈటెల రాజేందర్ చెప్పారని గుర్తు చేశారు. తనకు 200 ఎకరాలు హైదరాబాద్ లో ఉన్నాయి, ఒక్క ఎకరం అమ్మితే చాలు ఎన్నికల్లో ఖర్చు పెడుతా అని ఈటల అన్నారని తెలిపారు. 2001 నుండి మా కుటుంబం టిఆర్ఎస్, మరి మీరు పూటకో పార్టీ మార్చే వాళ్ళు నాకు నీతులు చెప్పుతారా ? అని ప్రశ్నించారు.