పానీపూరీకి ఇన్ని పేర్లు ఉన్నాయా?

-

తింటున్నా కొద్దీ.. తినాలనిపిస్తూ.. రకరకాల టేస్ట్ లతో అలరించే పానీపూరీకి చాలా పేర్లు ఉన్నాయట. కానీ.. మనకు తెలిసింది ఒకటో రెండో అంతే కదా. నిజానికి.. ఈ చిరుతిండి… నార్త్ ఇండియాకు చెందింది.

పానీ పూరీ.. ఆహా.. ఆ పేరు చెప్పగానే నోరు ఊరుతోంది కదా. పానీపూరీనా మజాకా. పానీపురీ బండి దగ్గర్నుంచి వెళ్లినా చాలు.. అక్కడి నుంచి వచ్చే సువాసనను పీల్చి.. పానీపూరీ తినకుండా అక్కడి నుంచి వెళ్లలేం.

తింటున్నా కొద్దీ.. తినాలనిపిస్తూ.. రకరకాల టేస్ట్ లతో అలరించే పానీపూరీకి చాలా పేర్లు ఉన్నాయట. కానీ.. మనకు తెలిసింది ఒకటో రెండో అంతే కదా. నిజానికి.. ఈ చిరుతిండి… నార్త్ ఇండియాకు చెందింది. సౌత్ ఇండియాకు కూడా పాకింది. ఇప్పుడు ఆ ఇండియా.. ఈ ఇండియా అనే తేడా లేకుండా.. ఎక్కడికెళ్లినా మీకు పానీపూరీ దర్శమిస్తుంది.

మరి.. ఏ ప్రాంతంలో పానీపూరీని ఏ పేరుతో పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటగా… తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే.. తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో పానీపూరీని గప్ చుప్ అని పిలుస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో, జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో, ఛత్తీస్ గఢ్ లోనూ పానీపూరీని గప్ చుప్ అని పిలుస్తారట.

మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో పానీపూరీ అనే పిలుస్తారు.

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పానీపూరీని.. పుచ్కా అని పిలుస్తారు. బంగ్లాదేశ్ లోనూ దీన్ని అదే పేరుతో పిలుస్తారు.

నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో.. పానీపూరీని గోల్ గప్పా అని పిలుస్తారు. నార్త్ ఇండియాలో చిరుతిండ్లు ఎక్కువగా తింటారని తెలుసు కదా. అందుకే.. మీరు నార్త్ ఇండియాకు వెళ్తే.. ఎక్కడికెళ్లినా పానీపూరీ దర్శనం ఇస్తుంది.

గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పానీపూరీని పకోడి అని పిలుస్తారు. పకోడి అంటే మనం తినే పకోడి కాదు. పకోడి అంటే అక్కడ పానీపూరీ అనే అర్థం.
పాని కే పటాషే.. దీన్ని హర్యానాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో పటాషి అని… నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో పుల్కి అని, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం టిక్కి అని.. నార్త్ ఇండియాలోని మరికొన్ని ప్రాంతాల్లో పడక అని కూడా పానీపూరీకి పేరుంది. పానీపూరీ గురించి ఎక్కువగా తెలియని వాళ్లు వాటిని వాటర్ బాల్స్ అని కూడా పిలుస్తారు. చూశారా.. పానీపూరీకి ఎన్ని పేర్లు ఉన్నాయో?

Read more RELATED
Recommended to you

Latest news