సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ‘దళపతి’ విజయ్ గా ఫ్యాన్స్ ఆయనని ని ఎంతగానో అభిమానిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు తెలుగులోను డబ్బింగ్ అయి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ‘తుపాకి’, ‘సర్కార్’, ‘పోలీసోడు’, ‘విజిల్’, ‘అదిరింది’ సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ దక్కించుకొని అటు కోలీవుడ్ తో ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.
అయితే ఈ స్టార్ హీరోకి కరోనా షాకిచ్చిందట. కోవిడ్-19 నేపథ్యంలో ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి కరోనా వైరస్ బారిన పడ్డవారిని గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు, మూడు నెలల్లో విదేశాలకు వెళ్లిన వారి జాబితాను తీసుకుని ఆ అందరి ఇళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో హీరో విజయ్ కూడా ఉండటంతో చెన్నైలోని ఆయన నివాసాన్ని కూడా అధికారులు తనిఖీ చేశారు. కాగా వైద్యులు విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా ఎఫెక్ట్ ఎవరీ లేదని నిర్ధారించారు.
అయితే ఈ విషయంలో కంగారు పడిన ‘దళపతి’ ఫ్యాన్స్ విజయ్ కి కరోనా వ్యాధి సోకలేదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా సెట్స్ మీద ఉంది. ప్రస్తుతం కరోనా తాకిడికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక వరుస హిట్స్ తో జోరుమీదున్న విజయ్ తాజా చిత్రం మాస్టర్ కూడా మరో భారీ విజయాన్ని దక్కించుకుంటుందని ఫ్యాన్స్ తో పాటు విజయ్ కూడా చాలా ధీమాగా ఉన్నారు.