టేస్టీ టేస్టీ ‘ రొయ్య‌ల ప‌కోడీ ‘

-

కావాల్సిన ప‌దార్ధాలు : 
రొయ్యలు – అరకేజి,
శనగపిండి – 1 కప్పు,
ఉల్లి తరుగు – కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీ స్పూను,
వంటసోడా – చిటికెడు,


ఉప్పు – రుచికి తగినంత,
కారం – అర టీ స్పూను,
చాట్‌ మసాలా – అర టీ స్పూను,
నూనె – వేగించడానికి సరిపడా

పచ్చిమిర్చి – 2,
గరం మసాలా – పావు టీ స్పూను,
కరివేపాకు – గుప్పెడు,
కొత్తిమీర తరుగు – 1 టేబుల్‌స్పూను,

తయారీ విధానం :
ముందుగా ఒక పాత్ర‌లో పచ్చిమిర్చి, ఉల్లి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, గరం మసాల, వంటసోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, శనగపిండితో పాటు రొయ్యలు ఒక పాత్రలో వేసి అవసరమైతే కొద్దిగా నీరు చల్లుకుని బాగా కలిపి అరగంట పక్కన పెట్ట‌కోవాలి.

ఆ తర్వాత నూనెలో పకోడీల్లా వేస్తూ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేగించాలి. బాగా వేగాక చాట్‌ మసాలా చల్లితే స‌రిపోతుంది. అంటే ఎంతో టేస్టీ టేస్టీ రొయ్య‌ల ప‌కోడీ రెడీ. రొయ్య‌ల్లో అనేక పోష‌కాలు ఉన్నాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు రొయ్య‌లు తీసుకోవ‌డం చాలా మంచిది. మ‌న శ‌రీరానికి కావాల్సిన అనేక ర‌కాలు పోష‌కాలు, ఖ‌నిజాలు అందిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news