చంద్రయాన్-2పై పాకిస్థాన్ కడుపుమంట.. ఆ దేశ మంత్రి ఇలా బయటపడిపోయాడుగా
భారత దేశం సగర్వంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చేతికి అంది వచ్చినంటే.. అంది.. కొద్దిలో జారి పోయింది. ఈ ఘటన ఒక్క భారతీయులనే కాకుండా ప్రపంచాన్ని కూడా నివ్వెర పోయేలా చేసింది. మరో రెండు నిముషాల్లో చంద్రయాన్-2 ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ప్రపంచం మొత్తం కళ్లు చేసుకుని వీక్షిస్తున్న క్షణాల్లో అనుకోని ఉపద్రవంగా .. సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. దీంతో ప్రపంచం మొత్తం ఇస్రో కు అండగా నిలిచింది. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయోగం పూర్తి సక్సెస్ 90 శాతం విజయం సాధించారు.
ఇప్పుడు జరిగింది చిన్న ఘటనే దీని నుంచి పాఠాలు నేర్చుకుని మరిన్ని ప్రయోగాలు విజయాలు సాధిం చాలంటూ.. ప్రపంచ దేశాలు భారత్‌కు ధైర్యం చెప్పాయి. అండగా నిలిచాయి. అయితే, దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం తన అక్కసును ప్రదర్శించింది. నిజానికి ముస్లిం దేశాలు ఏవీ కూడా ఇప్పటి వరకు అంతరిక్ష ప్రయోగాలు చేసింది లేదు. వాటికి అంత సామర్ధ్యమూలేదు. అలాంటి దేశం ఇప్పుడు భారత్‌ను చూసి ఏడుపుగొట్టు వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇస్రో ను ఉద్దేశించి దౌర్భాగ్య వ్యాఖ్యలు చేశాడు.
“మీకు చేతకాదు. అలాంటప్పుడు ఎందుకీ ప్రయోగాలు“-అంటూనే.. ఇండియా అనే పేరు `ఎండ్..యా` (అంతా అయిపోయింది అనే అర్ధం వచ్చేలా) అంటూ తన కుళ్లును వెళ్లగక్కాడు. ఇప్పుడు ఈ ట్వీట్‌పై భారత్ కన్నా ముందు ప్రపంచ దేశాలను ఆగ్రహానికి గురి చేసింది. మీరు ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడైనా చేశారా? అసలు అంతరిక్షం అంటే ఏంటో తెలుసా? అంటూ ప్రపంచ స్థాయి మేధావులు పాక్‌ను దుయ్యబడుతున్నారు. చేతనైతే.. ఇస్రో నుంచి కొంతైనా నేర్చుకునేందుకు ప్రయత్నించాలి కానీ.. బాధలో ఉన్న దేశంపై రాళ్లు రువ్వుతారా? అంటూ .. కామెంట్లు కుమ్మరిస్తున్నారు. మరి దీనిపై మన దేశ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
So ja Bhai moon ki bajaye Mumbai mein utar giya khilona #IndiaFailed https://t.co/RPsKXhCFCM
— Ch Fawad Hussain (@fawadchaudhry) September 6, 2019
Surprised on Indian trolls reaction, they are abusing me as I was the one who failed their moon mission, bhai hum ne kaha tha 900 crore lagao in nalaiqoon per? Ab sabr kero aur sonah ki koshish kero #IndiaFailed
— Ch Fawad Hussain (@fawadchaudhry) September 6, 2019