స్టార్ బక్స్.. పేరు విన్నారా ఎప్పుడైనా? వినే ఉంటారు. కాఫీకి తెగ ఫేమస్. రకరకాల కాఫీ ఉత్పత్తులను మార్కెట్ లో ప్రవేశపెడుతుంది స్టార్ బక్స్. మన భారత్ లోనూ స్టార్ బక్స్ స్టోర్స్ ను తెరిచింది. అయితే.. ఇటీవల ఓ సరికొత్త కాఫీని భారతదేశానికి అందించింది స్టార్ బక్స్. దాని పేరే పంప్కిన్ స్పైస్ లాట్టే. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే గుమ్మడికాయ కాఫీ. ఎప్పుడూ తాగలేదు కదా. గుమ్మడికాయతో కాఫీ ఏందిరా బాబు అంటారా?
కానీ.. దాన్ని ఎలా తయారు చేస్తారో చెబితే అబ్బ.. గుమ్మడికాయ కాఫీ టేస్ట్ చేయాల్సిందే అంటారు మీరు. అవును.. కాఫీ గింజలు, గుమ్మడికాయ, పాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయతో తయారు చేస్తారు దీన్ని. ఈ కాఫీని స్టార్ బక్స్ 2003 లోనే తయారు చేసింది. కానీ.. ఇండియాకు ఈ కాఫీని రీసెంట్ గా తీసుకొచ్చింది. విదేశాల్లో స్టార్ బక్స్ గుమ్మడి కాయ కాఫీకి విపరీతమైన క్రేజ్ ఉంది. మన దగ్గర ఈ కాఫీ ధర కేవలం రూ. 315. ఇంకెందుకు ఆలస్యం… వెంటనే స్టార్ బక్స్ కు పరిగెత్తుకెళ్లి ఓ గుమ్మడికాయ కాఫీని ఆస్వాదించేయండి.
Spicy pumpkin, toasty espresso & topped with delicious whipped cream! ☕️? #PumpkinSpiceLatte! Enjoy it now across all Starbucks stores. #StarbucksPSL #PeopleShareLove pic.twitter.com/ZRYH3XoEEL
— Starbucks India (@StarbucksIndia) September 11, 2018