సమ్మర్ వచ్చిందంటే.. ఆవకాయ పచ్చడి అందరి ఇళ్లల్లో చేస్తారు. ఆవకాయ అంటే మామిడికాయలతోనే చేస్తారు.. ఇది తినేప్పుడు బాగున్నా.. తిన్నాకా వేడి చేస్తుంది. ఈరోజు మనం పనసముక్కలతో ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దామా..! ఇది టేస్ట్‌లో నెంబర్ వన్ ఉంటుంది. అయితే ఇది మాములు ఆవకాయలా నిల్వ ఉండదు. ఫ్రష్‌గా చేసుకుని తినడమే.. ఇంకెందుకు లేట్.. పనసముక్కలతో ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..!
పనస ముక్కలతో ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు..
పనసముక్కలు అరకప్పు
పచ్చిమిర్చి ఐదు
తేనె పావు కప్పు
జీలకర్ర ఒక టీ స్పూన్
ఆవాలు ఒక టీ స్పూన్
మెంతుల పొడి ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
ఆవాల పొడి ఒక టీ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
వేపించిన నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్
ఎర్రకారం ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
ఇంగువ పొడి కొద్దిగా
కరివేపాకు కొద్దిగా
పసుపు కొద్దిగా
తయారు చేసే విధానం..
ముందుగా పనస ముక్కలను ఒక బౌల్లో తీసుకుని అందులో పసుపు, లెమన్ జ్యూస్, తేనె వేసి కలుపుకోండి. ఇలా కలిపివేసినదాన్ని..ఆవిరిలో పెట్టండి. పైన పచ్చిమిరకాయలు పెట్టి ఉడికించుకోండి. ఆవిరిలో పెట్టడం అంటే.. ఒక బౌల్‌లో వాటర్‌పోసి.. పైన ప్లైట్‌లో ఈ పనసముక్కలు వేసి మూతపెట్టి పచ్చిపోయే వరకూ ఉడికించాలి అంతే.. ఇలా ఉడికించుకున్న పనస ముక్కలను పక్కనపెట్టుకోండి. వేరే కడాయి తీసుకుని..అందులో మీగడ వేసి ఆవాలి, జీలకర్ర, ఇంగువ పొడి, కరివేపాకు వేగిన తర్వాత.. ఉడికించుకున్న పనసముక్కలు వేయండి. అందులోనే కారం, మెంతుల పొడి, జీలకర్ర పొడి బాగా కలుపుకోండి. వేడెక్కిన తర్వాత బౌల్లో తీసుకుని.. పైన ఆవాల పొడి, నువ్వుల పొడి, పైన కాస్త తేనె వేసుకుని కలుపుకుంటే సరి.. ఎంతో రుచిగా ఉండే పచ్చి పనసముక్కల ఆవకాయ రెడీ.. ! ఒక్కసారి టేస్ట్ చేస్తే.. అస్సలు వదలరు.! మీరు ఓ సారి ట్రే చేయండి.!
– Triveni Buskarowthu