చైతూ కారణంగా గొప్ప ఆఫర్ ను రిజెక్ట్ చేసిన సమంత.. ఏమైందంటే..?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలాగే అక్కినేని కోడలు గా గుర్తింపు తెచ్చుకున్న సమంత అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత టాలీవుడ్ లో బాగా జోరు పెంచుతోందని చెప్పవచ్చు. ఇకపోతే గతంలో సమంత బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ సమంత బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది అంటూ గుసగుసలు కూడా వినిపించాయి. ఇకపోతే అట్లీ దర్శకత్వం వహించిన బాలీవుడ్ షారుఖ్ ఖాన్ యాక్షన్ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార పాత్ర కోసం మొదటి సారి సమంతను ఎంపిక చేశారు.

కానీ కొన్ని రోజుల తర్వాత షారుఖ్ ఖాన్ తన జవాన్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పుడు ఆ సినిమాలో సమంత నే నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ గొప్ప ఆఫర్ను సమంత రిజెక్ట్ చేయడం వల్లే ఆ అవకాశం లేడీ సూపర్ స్టార్ నయనతార కు వెళ్ళినట్లు సమాచారం. ఇకపోతే జవాన్ చిత్రం యూనిట్ 2019లో స్క్రిప్ట్తో సమంత ను సంప్రదించగా వ్యక్తిగత కమిట్మెంట్ ల కారణంగా ఆమె సినిమాకు నో చెప్పిందట. ఇక వ్యక్తిగత కమిట్మెంట్ లు అంటే అప్పటికే చైతన్యతో కలిసి సమంత ఎంజాయ్ చేయాలని అనుకోవడం.. ఇక పిల్లలు కనాలని ప్లాన్ చేసుకోవడం ఇలా కొన్ని కమిట్మెంట్ తీసుకోవడం వల్లే అద్భుతమైన ఆఫర్ ను వదులుకుంది సమంత. కానీ సమంతా కనుక ఆ సినిమాలో చేసినట్లు అయితే కచ్చితంగా సమంత రేంజ్ నేషనల్ వైడ్ గా గుర్తింపు లభించేది.

కానీ ప్రస్తుతం బాలీవుడ్లో కథలను వింటూ మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరొకవైపు హాలీవుడ్ చిత్రాలలో నటించడానికి కూడా సిద్ధమైంది. ఏది ఏమైనా అదృష్టం వరించాలంటే సమయం సందర్భం తో అవసరం లేదు అంటూ నిరూపిస్తోంది సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version