నోరూరించే బ్రౌన్ రైస్ పులావ్..!

-

కేవలం వట్టి అన్నం మాత్రమే కాకుండా బ్రౌన్ రైస్ తో మనం వివిధ రకాల రెసిపీలని చేయవచ్చు ఇలా మనం ప్రయత్నం చేయడం వల్ల రుచి బాగుంటుంది పైగా అందరికీ నచ్చుతుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే మరి ఈరోజు బ్రౌన్ రైస్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

 

brown rice

బ్రౌన్ రైస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు:

ఒక కప్పు బ్రౌన్ రైస్
రెండు బంగాళదుంప ముక్కలు
ఒక చిన్న క్యాప్సికం
రెండు పచ్చిమిర్చి
అర టీ స్పూన్ జీలకర్ర
రెండున్నర కప్పులు నీళ్లు
ఉప్పు రుచికి సరిపడా
రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి
కొత్తిమీర
తరిగిన ఉల్లిపాయలు రెండు
తరిగిన బీన్స్ ఐదు
పావు కప్పు పల్లీలు
2 లవంగాలు
అర టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్
రెండు దాల్చిన చెక్కలు
గరం మసాలా
క్యారెట్ ముక్కలు

తయారు చేసే పద్ధతి:

ముందుగా బ్రౌన్ రైస్ తీసుకుని దానిని కడిగేసి నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న బియ్యంని కూడా దీనిలో వేసి తరిగిన కూరగాయ ముక్కలు అన్నిటిని కూడా వేసుకోవాలి. గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు కప్పుల నీళ్ళు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి.

 

డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ?

ఇలా ఈజీగా మష్రూమ్ బ్రౌన్ రైస్ తయారుచేసుకోండి..!

 

Read more RELATED
Recommended to you

Latest news