కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత చెలరేగుతూనే ఉంది. వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని జాతీయ కిసాన్ మోర్చా తెలిపింది. ఐత ఎన్నో రోజులుగా జరుగుతున్న ఈ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఐతే ఈ విషయంలో హర్యానా రాష్ట్రంలో రైతులపై లాఠీఛార్జి జరిగింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేసారు. అందుకు నిరసనగా రైతులు పోరాటం చేయాలని నిర్ణయించారు. లాఠీఛార్జీని నిరసిస్తూ కర్నాల్ జిల్లాల్లో నిరసన తెలిపేందుకు రైతులు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉంటే అటు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఐదుగురు కంటే ఎక్కువగా గుమికూడవద్దని 144సెక్షన్ విధించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అంతేకాదు జాతీయ రహదారిపై ప్రయాణ అంక్షలు పెట్టింది. మరేం జరుగుతుందో చూడాలి.