ఆరోగ్యానికి అటుకులు చాలా మంచిది

-

అటుకులు వడ్లు నుంచి వచ్చిన పదార్థమే. దీన్ని ఎంత తిన్నా ఆరోగ్యమే కాని అనారోగ్యం ఉండదు. అటుకులను వట్టిగా తనడంకంటే రకరకాల డిషెష్‌ ట్రై చేస్తే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అందులో అటుకుల పాయసం కూడా ఒకటి. అయితే.. అటుకుల పాయసం తయారీ విదానం ఎలానో తెలుసుకుందామా..

కావాల్సినవి :
అటుకులు : ఒక కప్పు
పాలు : రెండు కప్పులు
బెల్లం : అర కప్పు
జీడిపప్పు : 4 పలుకులు
కొబ్బరిపొడి : 2 టీస్పూన్స్‌
యాలకుల పొడి : అర టీస్పూన్‌
నెయ్యి : 2 టీస్పూన్స్‌
తయారీ :
ముందుగా అటుకులను ఒక కడాయిలో వేయించుకోవాలి. అదే కడాయిలో జీడిపప్పును కూడా వేయించుకోవాలి. తర్వాత కొబ్బరిపొడి వేడి వేసి వేయించాలి. వేగిన తర్వాత పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో బెల్లం వేయాలి. బెల్లం కూడా కరిగిన తర్వాత వేయించిన అటుకులు వేసి ఉడికించాలి. చివరిగా యాలకుల పొడి వేసి దించేయాలి. వేడివేడిగా అటుకుల పాయసం తింటే రుచిగా ఉంటుంది. ఇందులో బెల్లం వేయడం వల్ల జలుబు, దగ్గు ఏలాంటివి దరిచేరకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news