చ‌ల్ల చల్ల‌ని స్ట్రాబెర్రీ ఫ‌లూదా.. ఇలా చేయండి..!

-

మండు వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని పానీయాల‌ను సేవిస్తే వ‌చ్చే మ‌జాయే వేరు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఫ‌లూదా మన‌కు ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే ఇందులో అనేక ర‌కాలు ఉన్నాయి. వాటిలో స్ట్రాబెర్రీ ఫలూదా చ‌క్క‌ని రుచిని, పోష‌కాలను కూడా ఇస్తుంది. ఈ క్ర‌మంలోనే స్ట్రాబెర్రీ ఫ‌లూదాను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీ ఫ‌లూదా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

రోజ్ సిర‌ప్ – 1/2 టీస్పూన్
నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌లు – 1 టీస్పూన్
స‌గం ఉడికించిన ఫ‌లూదా సేవ్ – 1 టీస్పూన్
స్ట్రాబెర్రీ క్ర‌ష్ – 1 టీస్పూన్
చ‌ల్ల‌ని పాలు – 1 క‌ప్పు
వెనిల్లా ఐస్‌క్రీం – 1 స్కూప్

స్ట్రాబెర్రీ ఫ‌లూదా త‌యారు చేసే విధానం:

ఒక గ్లాస్‌లో రోజ్ సిర‌ప్‌ని తీసుకోవాలి. అందులో స‌బ్జా గింజ‌లు, ఫలూదా సేవ్‌, స్ట్రాబెర్రీ క్ర‌ష్‌ని ఒక‌దానిపై ఒక‌టి వేయాలి. ఇవ‌న్నీ క‌ల‌వ‌కుండా నెమ్మ‌దిగా పాలు పోయాలి. అనంత‌రం పైన ఐస్‌క్రీం వేయాలి. కావాలనుకుంటే ఈ మిశ్ర‌మాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవ‌చ్చు. లేదా అలాగే తీసుకున్నా బాగుంటుంది. అయితే స్ట్రాబెర్రీ రుచి మ‌రింత ఎక్కువ కావాలంటే స్ట్రాబెర్రీ క్ర‌ష్‌ని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. దీంతో చ‌ల్ల చ‌ల్ల‌ని స్ట్రాబెర్రీ ఫ‌లూదా రుచిని ఆస్వాదించ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version