అదిరిపోయే ` కందిప‌ప్పు మున‌క్కాయ క‌ర్రీ `

321

కావాల్సిన ప‌దార్ధాలు:
కందిపప్పు – 150 గ్రా
మునక్కాడలు – 2
టమోటాలు – 3
పసుపు – పావు టీస్పూను

కొత్తిమీర, కరివేపాకు – కొద్దిగా
వెల్లుల్లి ముక్కలు – 1 టీస్పూను
పోపు దినుసులు – 1 టీస్పూను

పచ్చిమిర్చి – 5
ఉప్పు- త‌గినంత‌
కారం- స‌రిప‌డా
ఎండుమిర్చి – 3
చింతపండు – 1 స్పూను
ఉల్లి ముక్కలు – 1 కప్పు
నూనె – తగినంత

తయారీ విధానం:
ముందుగా ప్రెషర్‌ కుక్కర్‌లో మునక్కాడ ముక్కలు, ఉప్పు, సరిపడా నీళ్లుపోసి రెండు విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించాలి. త‌ర్వాత నీళ్లు తీసి గిన్నెలో వేసుకోవాలి. అదే ప్రెషర్‌ కుక్కర్‌లో కందిపప్పు, ఉల్లిపాయలు, పసుపు, టమోటాలు, నీళ్లు పోసి 3 విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించి చల్లార్చాలి.

ఆ తర్వాత పప్పు రుబ్బుకుని తాలింపు వేసుకోవాలి. దీంట్లోనే ఉడికించిన ములక్కాడ ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. అంతే అదిరిపోయే కందిప‌ప్పు మున‌క్కాయ క‌ర్రీ రెడీ..!