అర‘టీ’.. వెరీ టేస్టీ!

-

సాధారణంగా చాలా మందికి టీ తాగనిదే రోజు మొదలుకాదు. కొంత మంది తలనొప్పి ఉన్నప్పుడు తాగుతారు. ఈ కాలంలో కరోనా పుణ్యమా! అని కూడా చాలా రకాల హెల్తీ టీలు మనకు ఏదోవిధంగా పరిచయమవుతున్నాయి. అయితే, ఇప్పుడు కాస్త వెరైటీగా బనానా టీని తయారు చేసుకుందాం. దాని రుచి కూడా చాలా బాగుంటుందట. అరటి పళ్లు విరివిగా దొరుకుతాయి. చాలా ప్రాంతాల్లో భోజనానికి బదులుగా అరటిని తింటారు. ఇందులో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. తక్షణ శక్తినిచ్చే ఈ పండు మనకు రిజనబుల్‌ ధరల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే చాలా రెసిపీల్లో అరటీ పండ్లను వాడతారు. టీ లో కూడా దీన్ని ట్రై చేశారు. టీ రుచి అదుర్స్‌ అందుకే ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చింది. ఈ టీతో రిలాక్సేషన్‌ ఫీలింగ్‌ కూడా వస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.


తయారీ విధానం

ముందుగా అరటి పండును ఓ పదినిమిషాలు బాగా ఉడికించాలి. అది ఉడుకుతున్నప్పుడు బుడగలు వస్తాయి, దాన్ని తీసేసి ఆ నీటిని తాగుతారు. దీనిలో ఏమీ కలపాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా రుచిగా ఉంటుంది. మీకు న చ్చితే అరటి తొక్కతోపాటు ఉడికించుకోవచ్చు. తొక్కే కదా అని తీసేయకండి. ఇందులో ఎక్కువ శాతం ఫైబర్‌ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల

మల బద్ధకం సమస్య తీరుతుంది. అలాగే ఈ ఆహారం వెంటనే రక్తంలో కలిసిపోకుండా చేస్తుంది. అందుకే డయాబెటీస్‌ ఉన్న వారికి ఇది మంచిది. మీకు నచ్చిన విధాంగా ఇందులో దాల్చినీ, తేనే కూడా కలుపుకొని తయారు చేసుకోవచ్చు. ఈ టీని రాత్రివేళ తాగితే నిద్ర కూడా వద్దన్నా వచ్చేస్తుంది. ఈ టీలో పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. దీంతో మీ గుండెకు, మెదడుకు మేలు చేస్తుంది. బనానా టీ ని ఫ్రిజ్‌లో కూడా రెండు రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news