ఆరోగ్యం: మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన ఏడు ఆహారాలు ఇవే..

-

మాడ్రన్ సమాజంలో ఆడవాళ్లు ఆఫీస్ పనులతో సతమతమవుతూ ఇంటి పనులు కూడా చూసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా వాళ్లకు ఎనర్జీ ఎక్కువగా కావాల్సి వస్తోంది. అటు జాబ్ చేస్తూ ఇటు ఇంటి పనులను చూసుకునే ఆడవాళ్లు.. సరైన ఆహారాలను తీసుకోకపోతే లేనిపోని సమస్యలు చుట్టుకుంటాయి.

ప్రస్తుతం ఆడవాళ్లు బలంగా ఉండాలంటే ఏయే ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

పాలకూర:

ఆకుకూరల్లో ఒక రకమైన పాలకూరను ఒక వారంలో కచ్చితంగా ఒక్కసారైనా తినాలి. దీనిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. పాలకూరలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎముకలను బలంగా ఉంచుతాయి.

బ్రోకలీ:

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటైన్ చేయడంతో పాటు, ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలను తగ్గించి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బ్రోకలీలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

బాదం:

బాదంలో ప్రోటీన్ తగినంతగా ఉంటుంది. వయసు పెరుగుతున్నప్పుడు శరీరానికి కావలసినంత ప్రోటీన్ అందిస్తూ ఉండాలి. అందుకే బాదం గింజలను డైట్లో కచ్చితంగా భాగం చేసుకోవాలి.

బీట్ రూట్:

ఫైబర్ అధికంగా ఉండే బీట్ రూట్ ని డైట్లో బాగం చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు, రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల బీపీ సంబంధిత సమస్యలు తలెత్తవు.

పప్పులు:

పప్పులలో శరీరానికి శక్తిని అందించే అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ప్రోటీన్ ఉంటుంది. 40 సంవత్సరాలు పైబడిన మహిళలు తమ రోజువారి డైట్ లో పప్పులను చేర్చుకుంటే శరీరానికి మంచి లాభం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version