Anjali : పొట్టి డ్రెస్‌లో పరువాలు ఒలకబోసిన తెలుగు అందం…

-

తెలుగమ్మాయి అంజలి..ఇప్పటి వరకు హోమ్లీ బ్యూటీగా ప్రేక్షకులను అలరించింది. అంజలి తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో అంజలి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

అచ్చ తెలుగులో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే టాలీవుడ్, కోలీవుడ్ లో అంజలి-జై డేటింగ్ వ్యవహారం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమకథ ఓపెన్ సీక్రెట్. కలిసి ఒకే అపార్ట్ మెంట్ లో గడిపిన గతం కూడా వీళ్లకుంది.

అలాంటి వీళ్లిద్దరూ తాజాగా విడిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా టాలీవుడ్ యువ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ తెరెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో అంజలి ఓ ఐటెం సాంగ్‌ లో నటిస్తోంది. అయితే.. ఈ ఐటెం సాంగ్‌ లో కనిపించిన తరహాలో తాజాగా ఫోటోలను దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇంత ఘాటూ అందాలు ఉన్నాయా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news