చీరకట్టులో కృతిశెట్టి.. పైట ఎగరేస్తూ బేబమ్మ క్యూట్ పోజులు

-

టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ భామ ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ఎక్కువగా ట్రెడిషనల్ ఔట్​ఫిట్స్​లోనే కనిపిస్తోంది. ముఖ్యంగా కృతి చీరకట్టులో ఎక్కువగా సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి చీరకట్టులో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చీరకట్టులో కృతి చాలా అందంగా కనిపిస్తోంది. బన్ స్టైల్​లో హెయిర్​ను ముడి వేసుకుని చేతికి గాజులు.. చెవికి జుంకాలతో అందంగా ముస్తాబైంది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. పైటను గాల్లోకి ఎగరేస్తూ దిగిన ఫొటో చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. కొంగును కప్పుకుని చిరునవ్వు చిందిస్తూ దిగిన ఫొటో చూసి ఫిదా అవుతున్నారు.

కృతి శెట్టి ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే ఈ బ్యూటీ స్టార్​డమ్ సొంతం చేసుకుంది. ఆ చిత్రం రిలీజ్ అవ్వకముందే అరడజనుకుపైగా అవకాశాలు బుట్టలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన కస్టడీ సినిమా తెగ సందడి చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version